Monday, 27 July 2020

మంత్రిగల వాని రాజ్యము

మంత్రిగల వాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలచుఁ దఱచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపుఁ గీలూడినట్లు జరుగదు సుమతీ!

మాటకుఁ బ్రాణము సత్యము
కోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
బోటికిఁ బ్రాణము మానము
చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్థము సుమతీ!

మానఘనుఁ దాతృధృతిఁ జెడి
హీనుండగు వాని నాశ్రయించుట యెల్లన్
మానెడు జలముల లోపల
నేనుఁగు మెయి దాఁచినట్లు లెఱుగుము సుమతీ!

Sunday, 26 July 2020

బంగారు కుదువఁ బెట్టకు

బంగారు కుదువఁ బెట్టకు
సంగరమునఁ బాఱిపోకు సరసుఁడవగుచో
నంగడి వెచ్చము లాడకు
వెంగలితోఁ జెలిమి వలదు వినరా సుమతీ!

బలవంతుఁడ నాకేమని 
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతఁ జిక్కి చావదె సుమతీ!

మండలపతి సముఖంబున
మెండైన ప్రధాని లేక మెలఁగుట యెల్లన్
గొండంత మదపుటేనుఁగు
తొండను లేకుండినట్లు దోఁచుర సుమతీ!

Saturday, 25 July 2020

పులిపాలు దెచ్చి యిచ్చిన

పులిపాలు దెచ్చి యిచ్చిన
నలవడఁగ గుండె గోసి యఱచె నిడినం
దలపొడుగు ధనముఁ బోసిన
వెలయాలికిఁ గూర్మిలేదు వినరా సుమతీ!

పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినములఁ గనకఁపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!

పొరుగునఁ బగవాడుండిన
నిర వొందఁగ వ్రాఁతగాఁడె ఏలికయైనన్
ధరఁ గాఁపు కొండెమాడినఁ
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!

Friday, 24 July 2020

పిలువని పనులకుఁ బోవుట

పిలువని పనులకుఁ బోవుట
కలయని సతి రతియుఁ రాజు గానని కొలువున్
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయ వలదుర సుమతీ!

పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతి లోనన్
గరికిని బ్రాణము తొండను
సిరికిని బ్రాణంబు మగువ సిద్ధము సుమతీ!

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు,జనులా
పుత్రుని గనుకొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

Wednesday, 22 July 2020

పాటెఱుగని పతి కొలువును

పాటెరుగని పతి కొలువును
గూటంబున కెఱుకపడని కోమలి రతియుం
బేఁటెత్త జేయు చెలిమియు
నేటికి నెదు రీఁదినట్టు లెన్నగ సుమతీ!

పాలను గలసిన జలమును
బాల విధంబుననె యుండుఁ బరికింపగాఁ
బాల చవిఁ జెఱచుఁ గావున
బాలసుఁడగువాని  పొందు వలదుర సుమతీ!

పాలసున కైన యాపద
జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకున్
దే లగ్నిఁ బడగఁ బట్టిన
 మేలెఱుఁగునె మీటుఁగాక మేదిని సుమతీ!

Tuesday, 21 July 2020

పరుల కనిష్టము సెప్పకు

పరుల కనిష్టము సెప్పకు
పొరుగిండ్లకుఁ పనులు లేక పోవకు మెపుడున్
బరుఁ గదిసిన సతి గవయకు
మెఱిఁగియు బిరుసైన హయము నెక్కకు సుమతీ!

పర్వముల సతులఁగవయకు
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలోఁ
గర్వింప నాలిఁ బెంపకు
నిర్వహణము లేనిచోట నిలువకు సుమతీ!

పలు దోమి వేయు విడియము
తలగడిగిన నాఁటి నిద్ర తరుణుల యెడలం
బొలయలుక నాఁటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినరా సుమతీ!

Monday, 20 July 2020

పరసతి కూటమిఁ గోరకు

పరసతి కూటమిఁ గోరకు
పరధనముల కాసపడక పరునెంచెకుమీ
సరిగాని గోష్టి సేయకు
సిరిచెడిఁ జుట్టంబు కడకుఁ జేరకు సుమతీ!

పర సతుల గోష్టి నుండిన
పురుషుఁడు గాంగేయుడైన భువి నిందబడున్
బరుసతి సుశీల యైనను
బరు సంగతి నున్న నింద పాలగు సుమతీ!

ఒరు నాత్మఁ దలఁచు సతి విడు
మఱు మాటలు పలుకు సుతుల మన్నింపకుమీ
వెఱ పెఱుఁగని భటు నేలకు
తఱచుగ సతిఁ గవయఁబోకు తగదుగ సుమతీ!