Friday, 10 July 2020

నమ్మకు సుంకరి జూదరి

నమ్మకు సుంకరి జూదరి
నమ్మకు నగసాలెవాని నటు వెలయాలిన్
నమ్మకు అంగడి వానిని
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!

నయమున బ్రాలుం ద్రావరు
భయమునను విషమ్మునైన భక్షింతురుగా
నయ మెంతదోసకారియొ
భయమే చూపంగవలయు బాగుగ సుమతీ!

నరపతులు మేరఁ దప్పిన
దిరి మొప్పగ విధవ యింటఁ దీర్పరి యైనన్
గరణము వైదికుఁడయినను
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ!

Wednesday, 8 July 2020

ధనపతి సఖుఁడై యుండియు

ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు బిక్ష మెత్తఁగవలసెన్
దనవారి కెంత కలిఁగిన
దనభాగ్యమె తనఁకుగాక తథ్యము సుమతీ!

ధీరులకుఁ జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గారవమును మఱిమీదట
భూరి సుఖావహము నగును భువిలోసుమతీ!

నడవకుమీ తెరువొక్కటఁ
గుడులకుమీ శత్రునింటఁ గూరిమితోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!

Tuesday, 7 July 2020

తల మాసిన నొలు మాసిన

తల మాసిన నొలు మాసిన
పలువల మాసినను ప్రాణ వల్లభునై నం
గులకాంత లైన రోఁతురు
తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ!

తాను భుజింపని యర్థము
మానవపతిఁ జేరుఁ గొంత మఱి భూగతమౌఁ
గానల నీఁగలు గూర్చిన
దేనియ యొరుఁ జేరునట్లు తిరముగ సుమతీ!

దగ్గర కొండెము సెప్పెడు
ప్రెగ్గడపలుకులకు రాజు ప్రియుఁడై మఱి తా
నెగ్గుఁ బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువుఁ బొడచుట సుమతీ!

Sunday, 5 July 2020

తములము వేయని నోరును

తములము వేయని నోరును
విమతులతోఁ జెలిమి సేసి వెత బడు తెలివిన్
గమలములు లేని కొలఁకును
హిమదాముఁడు లేని రాత్రి హీనము సుమతీ!

తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోకనుండు వృశ్చికమునకున్
దలతోఁక యనక యుండును
ఖలునకు నిలువల్లె విషము గదరా సుమతీ!

తల పొడవు  ధనముఁ బోసిన
వెలయాలికి నిజము లేదు వివరింపంగాఁ
దల దడవి బాస జేఁసిన
వేలయాలిని నమ్మరాదు వినరా సుమతీ!

Friday, 3 July 2020

తనకోపమె తన శత్రువు

తనకోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!

తనయూరి తపసి తనమును
దనపుత్రుని విద్యపెంపుఁ దనసతి రూపున్
దన పెరటి చెట్టుమందును
మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ!

తనవారు లేని చోటను
జన వించుక లేనిచోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజునకును నిలవఁ దగదు మహిలో సుమతీ!

Thursday, 2 July 2020

సుమతీ శతకము..చుట్టములు గానివారలు

చుట్టములు గానివారలు
చుట్టములము నీకటంచు సొంపుదలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!

చేతులకుఁ దొడవు దానము
భూతలనాథులకుఁ దొడవు బొంకమి ధరలో
నీతియతో దెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!

తడ వోర్వక యొడలోర్వక
కడువేగం బడచిపడినఁ గార్యంబగునే
తడవోర్చినఁ నొడలోర్చినఁ
జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ!

Wednesday, 1 July 2020

గడనగల మగనిఁ జూచిన

గడనగల మగనిఁ జూచిన
నడుగడుగున మడుఁగు లిడుచు రతివలు తమలో
గడ నుడుగు మగనిఁ జూచిన
నడుపీనుఁగు వచ్చె నగుదురు సుమతీ!

చింతింపకు కడచినపని
కింతులు వలతురని నమ్మ కెంతయు మదిలో
నంతఃపుర కాంతలతో
మంతనములు మాను మిదియె మతముర సుమతీ!

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్
హేమంబుఁ గూడఁబెట్టిన
భూమీశుల పాలఁ జేరు భువిలో సుమతీ!