మదిచెడి యొక కృూరవిటుడు మానక తిరుగన్
బొది జిలుక పిల్లి పట్టిన
జడువునె యా పంజరమున జగతిని సుమతీ!
రా పొమ్మని పిలువని యా
భూపాలుని ఁ గొల్వ భుక్తి ముక్తులు గలవే
దీపంబు లేని యింటను
చేపుణి కీళ్ళాడినట్లు సిద్ధము సుమతీ!
రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించు రాజుఁ గొల్వకు
పాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ!
No comments:
Post a Comment